Saturday, May 25, 2024

బాల్క సుమన్ పై కేసీఆర్ ప్రశంసలు… చిన్న వయసులోనే ఎంపీ

రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆదివారం నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా ఉన్న సుమన్ తనతో కలిసి నడిచి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారన్నారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన బాల్క సుమన్ చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారున్నారు. ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ గా పనిచేస్తున్నారు. బాల్క సుమన్ పై కేసీఆర్ ప్రశంసలు కురిపించడంతో బాల్క అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement