Saturday, April 20, 2024

India | హమ్​ అదానీకే హే కోన్​.. ఎందుకు చర్యల్లేవని ప్రధాని మోదీకి కాంగ్రెస్​ ప్రశ్నలు

బిలియనీయర్​ గౌతమ్​ అదానీ ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు స్పష్టంగా తెలుస్తోందని, అయితే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్​ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. గత జీ20 భేటీలో ప్రధాని ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టిస్తామని చెప్పారని, మరి ఇప్పుడు చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నలు సంధించింది. హమ్​ అదానీకే హే కోన్​.? అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్​ పార్టీ ఇవ్వాల (ఆదివారం) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ రూట్‌పై ప్రధాని మోదీ మౌనాన్ని కూడా ప్రశ్నించింది. ఈ అంశంపై మోదీ ప్రభుత్వం “పెద్దగా మౌనం వహించడం” కుమ్మక్కు అని ఆరోపిస్తూ బీజేపీ ప్రభుత్వం నుండి సమాధానాలు కోరింది. US ఆధారిత షార్ట్-సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సమ్మేళనంపై మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారుతో వంటి వాటిపై ఆరోపణలు చేయడంతో భారతీయ షేర్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ స్టాక్‌లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి.

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ మాట్లాడుతూ ఆదివారం నుండి కాంగ్రెస్ ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి రోజుకు మూడు ప్రశ్నలు సంధిస్తుందన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ సంస్థలు కొన్ని రోజుల్లోనే ఏకంగా రూ.8.76 లక్షల కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నాయన్నారు.

2016, సెప్టెంబర్5న చైనాలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ చాలా సీరియస్​ అంశాన్ని వెల్లడించారని జైరాం రమేశ్​ అన్నారు. ఆర్థిక నేరస్థులకు కచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారని, మనీలాండరర్‌లను ట్రాక్ చేయడానికి.. వారిని బేషరతుగా అప్పగించడానికి.. సంక్లిష్టమైన అంతర్జాతీయ నిబంధనల వెబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి చర్య తీసుకోవాలన్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా అవినీతిపరులను, వారి పనులను దాచిపెట్టే మితిమీరిన బ్యాంకింగ్ గోప్యతలపై కూడా అప్పట్లో మోదీ మాట్లాడారన్నారు.. మరి ఇప్పుడు జరిగిందా తమరి హయాంలోనే కదా.. ఇది మీరు, మీ ప్రభుత్వం HAHK (హమ్ అదానీ కే హై కౌన్) అని చెప్పకుండా దాచలేరని.. కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ నేత చురకలు అంటించారు.

- Advertisement -

ప్రధానమంత్రి మోదీ స్నేహితుడు గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కానీ, ప్రధాని మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. దీనిపై ఎటువంటి విచారణ జరగలేదని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ట్వీట్‌లో పేర్కొంది. సమాధానాలు సిద్ధంగా ఉంచండి.. సోమవారం దేశవ్యాప్తంగా నిరసనను నిర్వహిస్తామని ఆ పార్టీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement