Friday, April 19, 2024

ట్రోల‌ర్స్‌కి థ‌మ‌న్ రియాక్ష‌న్‌.. మ‌రీ ఇంత దారుణ‌మా?

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న సంగీత దర్శకుల్లో ఎస్ఎస్ థమన్ ఒకరు. లాస్ట్ ప్రాజెక్ట్ వీర సింహారెడ్డి సినిమాకి థమన్ సానుకూల ప్రశంసలను అందుకున్నాడు. అంతేకాకుండా వేరే హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లలోనూ చేస్తున్నాడు.. దాంట్లో మహేష్ బాబు #SSMB28, పవన్ కళ్యాణ్ – సుజీత్ వంటివి కూడా ఉన్నాయి. కాగా, ప్రస్తుతం SS థమన్ ట్విట్టర్‌లో ట్రోల్స్, ప్రతికూలతను ఎదుర్కొంటున్నాడు. పవన్ కళ్యాన్ – సుజీత్ ప్రాజెక్ట్ కి పవన్ ఫ్యాన్స్ అందరూ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని ఎక్స్ పెక్ట్ చేశారు.

కానీ, మేకర్స్ థమన్ ని సెలక్ట్ చేశారు. దీంతో థమన్ పై ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఈ అగ్ర హీరో అభిమానులు. అంతే కాకుండా థమన్ ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా అదే అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పడం.. ఆ మూవీలోని హీరో అతని ఫేవరేట్ అని చెప్తూ ఉండటం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దీంతో థమన్ పై ట్రోల్స్‌ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులుగా ఇదే కొనసాగుతోంది. దీంతో కూల్ గా ఉండే థమన్ తన ఓపికను కోల్పోయాడు. ట్విట్టర్‌లో తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ త‌ను కూడా ఓ ట్వీట్ చేశాడు.

- Advertisement -

అయితే.. అది కూడా క్రియేటివ్‌గా రియాక్ట్ అయ్యాడు. అతను “గెట్ లాస్ట్” అని చెప్పే ఆడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. “Rest In Peace Dear #Negativity !! To all the kids out there అంటూ థమన్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement