Saturday, May 28, 2022

తెలంగాణ రైతన్నకు వెన్నెముక కేసీఆర్‌.. ఎమ్మెల్యే కోరుకంటి

పెద్దపల్లి, ప్ర‌భ‌న్యూస్ : తెలంగాణ రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక హితుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా అంతర్గాం మండల కేంద్రంలో 100 ట్రాక్టర్ల బారీ ర్యాలీ చెపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులకు పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువుల పంపీణీ 24 ఉచిత కరెంట్ అందించి తెలంగాణ వ్యవసాయాన్ని పండగగా మార్చిన దేవుడు కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుపరుస్తున్న రైతు సంక్షేమ పథకాలని దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భీమా పధకం ప్రవేశపెట్టి రైతుకు వెన్నుముకగా సి.ఎం కేసీఆర్‌ నిలుస్తున్నారాన్నారు. రైతులను రాజుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని, తెలంగాణ అన్నదాతకు ఆపద్భాందవుడిగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిలిచారని అన్నారు. రైతు బంధు సంబురాలు గత వారం రోజులుగా గ్రామాల్లో పండగలగా జరుపుకుంటున్నరన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement