Wednesday, January 19, 2022

తల్లిని హతమార్చిన తనయుడి అరెస్టు

నెల్లూరు (క్రైం) : తల్లిని హతమార్చిన తనయుడిని నెల్లూరు వేదయపాలెం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వేదాయపాళెం స్టేషన్లలో ఇన్ ఛార్జి డీఎస్పీ వై హరినాథ్రెడ్డి కేసుకు సంబంధించి పూర్వాపరాలు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. గత నెల పందొమ్మిదివ తేదీ పెదపాలెం చంద్రమౌళినగర్లో లక్ష్మి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది.

తన తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడి హతమార్చారని కుమారుడు సాయితేజ భాజాపాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వేదాయపాలెం ఇన్ స్పెక్ట‌ర్ కె నర్సింహారావు పలు కోణాల్లో విచారించి కుమారుడే తల్లిని హతమార్చాడని నిగ్గుతేల్చారు. భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మి ఇతరులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుందని కక్ష పెంచుకున్న కుమారుడు సాయితేజ ఆమెను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఆమె శరీరం మీద కొన్ని గాయాలు చేసి గుర్తుతెలియని దుండగులు ఎవరో ఆమెపై అత్యాచారానికి యత్నించి ఆమెను హతమార్చారని నమ్మించే ప్రయత్నం చేశాడు. వేదాయ‌పాలెం ఇన్ స్పెక్ట‌ర్ కె నర్సింహారావు నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News