Thursday, May 2, 2024

ప్రభుత్వ వేడుకగా కరుణానిధి జయంతి.. ప్రకటించిన ప్రభుత్వం

తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే దివంగత నేత ఎం. కరుణానిధి జయంతిని (జూన్ 3న) తమిళనాడు ప్రభుత్వ వేడుకగా నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం తెలిపారు. అసెంబ్లీలో రూల్ 110 కింద ఒక ప్రకటన చేస్తూ సీఎం స్టాలిన్ కరుణానిధి 98వ జయంతి సందర్భంగా జూన్ 3న చెన్నైలోని అన్నాసాలైకి అభిముఖంగా ఉన్న విశాలమైన ఒమండూరర్ ప్రభుత్వ ఎస్టేట్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు.

దివంగత నేత,ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి 1957 అసెంబ్లీ ఎన్నికల నుండి 2016 వరకు కుళితలై నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసి గెలిస్తూ వచ్చారు. తన స్వస్థలమైన తిరువారూర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించినప్పటి నుండి తన జీవితంలో ఎన్నడూ ఓడిపోలేదని స్టాలిన్ అన్నారు. కాగా, కలైంజ్ఞర్ అని పిలుచుకునే కరుణానిధి ఆగస్టు 7, 2018న తన 94 సంవత్సరాల వయసులో చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement