Wednesday, May 1, 2024

కార్తికేయ‌2 రిలీజ్ వాయిదా-టికెట్లు బుక్ చేసిన వారికి డ‌బ్బులు తిరిగి ఇస్తాం- హీరో నిఖిల్

కార్తికేయ‌2 చిత్రం రిలీజ్ వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. యంగ్‌ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వర్‌ జంటగా కార్తికేయ-2 సినిమాను తెరకెక్కించారు.. అయితే.. ఈ సినిమాను పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. విడుదల తేదీ దగ్గర పడుతుండగా మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ కూడా చేసారు. ఇందులో భాగంగా తాజాగా ”కార్తికేయ 2” ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆసక్తికర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ మరియు గ్లిమ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.అయితే తాజాగా ఆగస్టు మొదటి వారానికి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో హీరో నిఖిల్ పోస్ట్ చేస్తూ.. సినిమా వాయిదా పడుతున్నందుకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టాడు. కార్తికేయ 2 సినిమా జూలై 22వ తేదీన విడుదల కావడం లేదు. ఆగస్టు మొదటి వారంలో వస్తుంది. అందరికీ క్షమాపణలు. ప్రీమియర్ షో కోసం టికెట్లు బుక్ చేసిన వారందరికీ డబ్బులు తిరిగి చెల్లిస్తాం అంటూ నిఖిల్ సిద్ధార్థ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement