Thursday, May 2, 2024

కార్తికేయ‌2 ట్రైల‌ర్ – రిలీజ్ డేట్ ఎనౌన్స్

ద్వాప‌ర యుగానికి సంబంధించిన ఒక ర‌హ‌స్యాన్ని ఛేదించే క‌థే కార్తికేయ‌2. ఈ చిత్రంలో యంగ్ హీరో నిఖిల్ న‌టిస్తున్నాడు. ఈ కథ మొదటి నుంచి చివరివరకూ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందనీ, తన కెరియర్ లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని నిఖిల్ చెప్పారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించారు. కాలభైరవ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.కాగా ఆగ‌స్టు 6వ తేదీన కార్తికేయ‌2 ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు చిత్ర మేక‌ర్స్. చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ సినిమా రూపొందింది. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement