Monday, April 29, 2024

ఓటీటీలో కార్తికేయ‌-2.. ద‌స‌రా సందర్భంగా డిజిటల్ స్ట్రీమింగ్..!

కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనాలను సృష్టించిన ఈ మూవీ… డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్డంగా ఉంది. థియేట‌ర్ల‌లో చూసిన వారు చూడ‌నివారు అంతా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. థియేటర్లు కూడా సరిగా దొరకని పరిస్థితుల్లో రిలీజై.. ఆ తర్వాత పెను సంచలనం సృష్టించి అన్నీ భాష‌ల్లో దుమ్ము రేపింది కార్తికేయ-2.

తాజాగా ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న జీ5 కార్తికేయ-2 ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్‌ చేసింది. అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా జీ5లో అందుబాటులోకి రానుండటం విశేషం. థియేటర్లలో అంచనాలకు మించి సక్సెసైన ఈ సినిమా.. ఓటీటీలోనూ అలాంటి సంచలనాలనే సృష్టిస్తుందని మేకర్స్‌ ఆశతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement