Tuesday, May 7, 2024

Karnataka – ధాన్యం బస్తాల కింద చితికిన ఏడుగురు జీవితాలు

కర్ణాటకలో విషాదం వెలుగు చూసింది. బ్రతుకు దెరువుకు బీహార్ నుండి కర్ణాటకకు వలస వచ్చిన ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. వివరాల లోకి వెళ్తే.. కర్ణాటక లోని విజయపుర లోని రాజ్‌గురు ఇండస్ట్రీస్‌ లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో విషాదం వెలుగు చూసింది. గ‌త రాత్రి గోదాములో స్టోరేజీ యూనిట్‌ కూలిపోయింది. దీనితో ఆ సమయంలో కార్మికులు కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మందికి పైగా కార్మికులు మొక్కజొన్న బస్తాల కింద చిక్కుకున్నారు.

ఈ నేపథ్యంలో బస్తాల కింద చిక్కుకున్న కార్మికులలో ముగ్గురిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా 7 మంది కార్మికులు చనిపోయారు. కాగా వారిలో 6 మంది మృత దేహాలను బస్తాల కింద నుండి అతి కష్టం పైన బయటకు తీశారు. మృతులు రాజేష్ ముఖియా (25), రాంబ్రీజ్ ముఖియా (29), శంభు ముఖియా (26), లుఖో జాదవ్ (45), రామ్ బాలక్ (52)గా గుర్తించారు. మరొకరి మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement