Saturday, May 4, 2024

అభిమానుల తొక్కిసలాట. …కమల్ కు గాయం

ప్రముఖ సినీ నటుడు.. ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ కాలికి గాయమైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ కోయంబత్తూర్ లో కమల్ ప్రచారం చేస్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో కొంతమంది కమల్ హాసన్ కాలిని తోక్కేసారు. ఈనేపథ్యంలోనే కమల్ కాలికి గాయం అయింది.

తమిళనాడు ఎన్నికలలో డీఎంకే అన్నాడీఎంకే లకు ప్రత్యామ్నాయంగా కమల్ ఈ సారి ఎన్నికలలో దిగారు. దక్షిణ కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా డాక్టర్ల సూచన మేరకు ఆయన ప్రచారాన్ని ఆపేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement