Sunday, May 5, 2024

5జీ టెక్నాల‌జీని వ్యతిరేకిస్తూ జూహీ చావ్లా పిటిషన్..

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి, ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ జూహీ చావ్లా 5 జీ టెక్నాల‌జీ అమ‌లుపై కోర్టును ఆశ్ర‌యించారు. ఐదో తరం వైర్ లెస్ నెట్వర్క్ సేవలుగా ప్రచారం పొందుతున్న 5జీ భారత్ లోనూ రంగప్రవేశం చేస్తోంది. అధికవేగంతో కూడిన ఇంటర్నెట్ సర్వీసులు, ఫోన్ సేవలు 5జీతో సాధ్యమవుతాయి. అయితే, 5జీ కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందన్న వాదనలు కూడా తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ లో 5జీ సేవలను వ్యతిరేకిస్తూ ప్రముఖ నటి జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జూహీ చావ్లా స్పందించారు.

దేశంలో 5జీ సాంకేతిక అమ‌లు కావ‌డంపై వ‌చ్చే రేడియో ధార్మిక‌త స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని, దీని వ‌ల్ల ప‌ర్యావ‌రణానికి ప్ర‌మాదం ఉంద‌ని జూహీ చావ్లా త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. సాంకేతికప‌ర‌మైన విష‌యాల‌ను వ్య‌తిరేకించ‌డం లేద‌ని, అయితే వైర్‌లెస్ సంబంధిత ప‌రిక‌రాల నుంచి ఏర్ప‌డే రేడియేష‌న్ ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని జూహీ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కొత్త 5జీ టెక్నాల‌జీ మ‌నుషుల‌కు, జంతువుల‌కు హానిక‌రం కాద‌ని స‌ద‌రు ప్ర‌భుత్వ విభాగం నిర్దారించాల‌ని జూహీ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement