Monday, April 29, 2024

స్టాక్‌మార్కెట్లలో జోష్‌.. కొత్త సంవత్సరానికి లాభాలతో స్వాగతం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త సంవత్స రాన్ని లాభాలతో స్వాగతం పలికాయి. ప్రారంభంలో సూచీలు తడబడినా చివరకు లాభాల్లో ముగిశాయి. లోహ, మౌలిక రంగాల షేర్లు రాణించడం సూచీలకు కలిసివచ్చింది. ఒరో వైపు జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడం, 2022లో వాహన విక్రయాలు రికార్డ్‌ స్థాయికి చేరుకోవడం వంటి సానుకూల పరిణామాలుతో పాటు తయారీ రంగం 13 నెలల గరిష్టానికి చేరుకుందని వెలువడిన వివరాలు కూడా మార్కెట్లతో జోష్‌ను నింపాయి. ఐరోపా మార్కెట్లు, అమెరికా ప్యూచర్స్‌ లాభాల్లో ఉండటం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది.

సెన్సెక్స్‌ 327.05 పాయింట్లు లాభపడి 61167.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 92.15 పాయింట్ల లాభంతో 18197.45 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 166 రూపాయలు పెరిగి 55183 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 178 రూపాయలు పెరిగి 69591 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.82 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు

టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆల్ట్రా సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, మారుతీ సుజుకీ,
టీసీఎస్‌ , హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

ఏషియా పెయింట్స్‌, టైటాన్‌ కంపెనీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బ్రిటానియా, అదానీ ఎంటర్‌ప్రైజేస్‌, సిప్లా, అపోలో ఆస్పటల్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement