Sunday, May 19, 2024

జిన్నా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ – మైసూర్ బ‌జ్జీగా వెన్నెల‌కిశోర్

జిన్నా చిత్రం నుండి క‌మెడియ‌న్ వెన్నెల కిశోర్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంలో పాయల్ – సన్నీలియోన్ అందాల సందడి చేసిన ఈ సినిమా, తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ‘జిన్నా’ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమాలో ఆయన ‘మైసూర్ బజ్జీ’ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ .. ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆయన పాత్రలో కామెడీతో పాటు కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందనే విషయం ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించారు. సొంత బ్యానర్ పై విష్ణు నిర్మించిన ఈ సినిమాకి, జి.నాగేశ్వరరెడ్డి కథను అందించగా .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే జనంలోకి వెళ్లాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement