Wednesday, May 8, 2024

జిన్నా మూవీలో సాంగ్ కి – కొరియోగ్రాఫ్ చేయ‌నున్న గ‌ణేశ్ ఆచార్య‌

హీరో మంచు విష్ణు న‌టిస్తోన్న తాజా చిత్రం జిన్నా..ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ , స‌న్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలీవుడ్ స్టార్ కొరియోగ్ర‌ఫ‌ర్ గ‌ణేశ్ ఆచార్య ఈ సినిమాకు ప‌నిచేయ‌బోతున్నాడ‌ట‌.ఈ సినిమాలో ఎంగేజ్‌మెంట్ బ్యాక్ డ్రాప్‌లో వ‌చ్చే ఓ పార్టీ సాంగ్‌కు గ‌ణేశ్ ఆచార్య నృత్య‌రీతులు స‌మ‌కూర్చ‌నుండ‌ట‌మే కాకుండా..స్క్రీన్‌పై కూడా మెరువ‌నున్నార‌ని ఫిలింన‌గ‌ర్ సర్కిల్‌లో జోరుగా టాక్ వినిపిస్తోంది.

తాజా అప్ డేట్ ప్ర‌కారం ఈ పాట‌ను మంచు విష్ణు, స‌న్నీలియోన్‌, పాయ‌ల్‌, వెన్నెల కిశోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, ర‌ఘుబాబుపై చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌య‌మేంటంటే ట్రిపుర్ ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్ కూడా ఈ ప్రాజెక్టులో లీడ్ పెయిర్ మీద వ‌చ్చే ఎన‌ర్జిటిక్ సాంగ్‌కు కొరియోగ్ర‌ఫీ చేయ‌బోతుండ‌టం. నూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్. మంచు విష్ణు హోం బ్యాన‌ర్ ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.మ‌రోవైపు క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement