Monday, April 29, 2024

ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధమైన జెర్సీ..

నాచ్యుర‌ల్ స్టార్ నాని కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల‌లో ‘జెర్సీ’ ఒక‌టి. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ చిత్రం భారీ విజ‌యం సాధించ‌కపోయినా ప్రేక్ష‌కుల నుంచి గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్‌క‌పూర్ రీమేక్ చేశాడు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన గౌత‌మ్ తిన్న‌నూరీ.. రీమేక్ వ‌ర్ష‌న్ కూడా తెర‌కెక్కించాడు. జెర్సీ హిందీ సినిమాని అల్లు ఎంట‌ర్టైన‌మెంట్స్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, సితార ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్ల‌తో క‌లిసి అమ‌న్ గిల్ నిర్మించాడు.

పలుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమాని చివ‌రికి ఏప్రిల్ 22న విడుద‌ల చేశారు. ఎమోష‌న‌ల్‌గా కొంచెం స్లో పేజ్‌లో ఉండ‌టంతో బాలీవుడ్ ప్రేక్ష‌కులకు ఈ చిత్రం రుచిప‌డ‌లేదు. దాంతో ఈ చిత్రం మొద‌టి వారంలోపే దాదాపు స‌గానికి పైగా థియేట‌ర్ల నుంచి వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్‌లో మే20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున ఆర్ఆర్ఆర్ హిందీ వెర్ష‌న్ కూడా స్ట్రీమింగ్ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement