Friday, April 26, 2024

జూన్​ 20 నుంచి జేఈఈ ఎగ్జామ్స్​.. అడ్మిట్​ కార్డులను వెబ్​సైట్​లో పెట్టిన ఐఐటీ

దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో(IIT) ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. సవరించిన పరీక్ష తేదీలు కూడా విడుదలయ్యాయి. అయితే తాజా షెడ్యూల్‌ ప్రకారం జూన్ 20, 21, 22, 23, 24, 26, 26, 27, 28, 29 తేదీలకు ఈ ఎగ్జామ్స్ ను మార్చినట్లు ఎన్‌టీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక సెషన్‌ 1 కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ ఈ వారంలో విడుదల చేయనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement