Monday, December 9, 2024

యాక్ష‌న్ సీన్స‌తో అద‌రగొట్టిన షారూక్ ఖాన్ జ‌వాన్ ట్రైల‌ర్

YouTube video

పఠాన్’ సినిమాతో ఇటీవల సూపర్‌హిట్ అందుకున్న‌ బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తాజ‌గాగా నటిస్తున్న మరో భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌‌ను ‘ప్రివ్యూ’ పేరుతో ఈ రోజు రిలీజ్ చేశారు.
‘‘ఎవరు నేను? ఎవర్నీ కాను.. తల్లికిచ్చిన మాట కావచ్చు.. నెరవేరని లక్ష్యం కావచ్చు.. నేను మంచివాడినా? చెడ్డవాడినా? పుణ్యాత్ముడినా, పాపాత్ముడినా? నీకు నువ్వే తెలుసుకో.. ఎందుకంటే నేనే నువ్వు.. రెడీ” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. చివరి దాకా వరుసపెట్టి యాక్షన్ సీన్లతో నిండిపోయింది.

ఇక చివర్లో ‘‘ఇది ఆరంభం మాత్రమే. నేను విలనైతే.. ఏ హీరో నా ముందు నిలబడలేడు” అంటూ షారుక్ చెప్పిన డైలాగ్ ఈ ‘ప్రివ్యూ’ మొత్తానికి హైలైట్. చివర్లో షారుక్‌ గుండుతో కనిపించడం విశేషం. అనిరుధ్‌ అందించిన సంగీతం కూడా మరో స్థాయిలో ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణే తదితర స్టార్లు నటిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement