Thursday, February 2, 2023

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి రాజీనామా

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత కొద్ది సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని కంటతడి పెట్టుకున్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన మహిళనని చూడకుండా అణచివేతకు గురవుతున్నానని ఆరోపించారు. సంజయ్ దొర మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. మీ గడీల నుండి బయటకు వస్తున్నాను, ఇదిగో నా రాజీనామా పత్రం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా సంచలనం రేపింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement