Sunday, May 5, 2024

Breaking : తెలుగు రాష్ట్రాల్లో పది ప్రాంతాల్లో ఐటీ సోదాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, హైటెక్ సిటీ సహా పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. అలాగే ఆర్ ఎస్ బ్రదర్స్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్ ఎస్ బ్రదర్స్ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, పొట్టి సత్యనారాయణ, టి.ప్రసాద్ రావు, అభినయ్ వెంకటసాయి, రాకేష్, కేశవ్ గుప్తా, సీర్న రాజమౌళి, సురేష్ ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement