Saturday, May 18, 2024

ఇస్రో-నాసా భాగస్వామ్యం సక్సెస్… తుది దశలో వాతావరణ మార్పుల అధ్యయనం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌తో వాతావరణ మార్పులపై అధ్యయనం చేసేందుకు భారత్‌–అమెరికా సంయుక్త మిషన్‌ చివరి దశలో ఉందని, 2024 మొదటి త్రైమాసికంలో ప్రయోగం ఉంటుందని నాసా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ డైరెక్టర్‌ లారీ లెషిన్‌ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భూకంపాలు, సునామీల వంటి ప్రమాదాలను అంచనా వేయడంలో ఇస్రో సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌ (ఎన్‌ఐఎస్‌ఎఆర్‌) కూడా సహాయపడుతుందని, చంద్రయాన్‌-3 తర్వాత భారతదేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల గౌరవం ఎల్లలు దాటిందన్నారు.

ప్రయోజనం, ప్రభావం

- Advertisement -

ఎన్‌ఐఎస్‌ఎఆర్‌ అనేది ఇస్రో-నాసా అభివృద్ధి చేసిన తక్కువ భూ కక్ష్య అబ్జర్వేటరీ. ఇది భూమిని 12 రోజుల్లో మ్యాప్‌చేస్తుంది. పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్రమట్టం పెరుగుదల, భూగర్భ జల స్థాయిలు, సహజ ప్రమాదాలలో మార్పులను అర్థం చేసుకోవడానికి స్థిరమైన డేటాను అందిస్తుంది.

భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటంతో సహా ప్రకృతి విపత్తుల ముప్పును నిజ సమయంలో అంచనా వేస్తుంది. భూమి ఉపరితలంపై జరిగే మార్పులను వీక్షించడం వల్ల శాస్త్రవేత్తలు మార్పు వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకుంటారని, భవిష్యత్తు పరిణామాలపై కచ్చితమైన అంచనాకు ఎన్‌ఐఎస్‌ఎఆర్‌ సహాయపడుతుందని నాసా అధికారి తెలిపారు.

సహకారం

ఎన్‌ఐఎస్‌ఎఆర్‌ అభివృద్ధి విషయంలో ఇస్రో-నాసా మధ్య సహకారం పట్ల మేము చాలా థ్రిల్‌ అయ్యాము. ఇది మన రెండు దేశాల మధ్య సాంకేతికతపై అతిపెద్ద సహకారం. 30-40 మంది మా ఇంజనీర్లు బెంగళూరులో తమ ఇస్రో స#హూద్యోగులతో తొమ్మిది నెలలుగా భుజం భుజం కలిపి పని చేస్తున్నారు. ఇస్రోకు శాస్త్రవేత్తలు కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీలో రాడార్‌పై పని చేస్తూ గడిపారు. మొత్తంమీద ఇరు బృందాలు అద్భుతంగా కలిసి పనిచేశాయి.

విజయానికి అనేక మార్గాలు

అంతరిక్షంలో సక్సెస్‌ సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయని ఇస్రో భాగస్వామ్యం నుంచి మేము కొత్త విషయాన్ని తెలుసుకున్నాం. ఒకరి నుండి మరొకరం నేర్చుకుంటున్నాము. ఇస్రోలోని మా సహచరులతో మాట్లాడితే ఈ విషయం మీకే అర్థమవుతుంది. కొత్త ఆలోచనలు కలిసి రావడాన్ని ఇన్నోవేషన్‌ ఇష్టపడుతుంది. చంద్రయాన్‌-3 మిషన్‌ చారిత్రాత్మక విజయం తర్వాత భారతదేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల గౌరవం పెరిగింది అని జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ డైరెక్టర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement