Thursday, April 18, 2024

రాజీనామాకు సిద్దమైన మరో ఐపీఎస్ అధికారి..కారణం అదేనా..

మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరికొందరు దళిత ఆఫీసర్లు పయనించేందుకు సిద్ధమయ్యారు. కాగా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. కాగా అదేబాటలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేందుకు కొందరు ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారు. పోలీసు శాఖలో దళిత అధికారులను వేధిస్తున్నారని మనస్తాపంతో ఉన్న డీఎస్పీ విష్ణుమూర్తి ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఇవాళ తన రాజీనామా లేఖను అందించనున్నట్టు సమాచారం. కాగా హుజూరాబాద్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయాలని విష్ణుమూర్తి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి : ఎన్నికలు జరిగిన 4 నెలల తర్వాత.. ఏలూరులో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement