Monday, April 29, 2024

IPL | రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు.. ఢిల్లీ టార్గెట్ 182

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మద్య‌ జ‌రుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేయ‌గ‌లిగింది బెంగ‌ళూరు టీం. ఇక‌, వార్న‌ర్ క‌ప్టెన్సీ వ‌హిస్తున్న ఢిల్లీ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 120 బంతుల్లో 182 పరుగులు చేయాల్సి ఉంది.

ఆర్సీబీ జ‌ట్టు త‌రుఫున ఓపెనెర్స్ గా వ‌చ్చిన కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ 10 ఓవ‌ర్ల వ‌ర‌కు వారి పార్ట‌న‌ర్ షిప్ కొన‌సాగించి 82 ప‌రుగులు చేయ‌గా.. 11 వ ఓవ‌ర్ లో వారి పార్టన‌ర్ షిప్ బ్రేక్ అయింది. 32 బంతుల్లో 45 ప‌రుగులు చేసిన ఫాఫ్ డు ప్లెసిస్ మిచెల్ మార్ష్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ త‌రువాత వ‌చ్చిన మాక్స్‌వెల్ కూడా డ‌క్ అవుట్ అయ్యాడు. దీంతో మిచెల్ మార్ష్ కి ఒకే ఓవ‌ర్ లో రెండు వికెట్లు ద‌క్కాయి.

ఇక‌ ఆ త‌రువాత వ‌చ్చిన మహిపాల్ లోమ్రోర్.. కోహ్లీ పార్ట‌న‌ర్ షిప్ లో ఫోర్లు సిక్స్ లు బాది ( 29 బంతుల్లో 54 పరుగులు) . అయితే వీరి పార్టన‌ర్ షిప్ 16వ ఓవ‌ర్ వ‌ర‌కే సాగింది. 16వ ఒక‌ర్లో కోహ్లీ (46 బంతు్లో 55 ప‌రుగులు) అర్ధ సెంచ‌రీతో ముఖేష్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక ఆ త‌రువాత క్రీస్ లోకి వ‌చ‌చ్చిన దినేష్ కార్తీక్ 9 బంతుల్లో 11 ప‌రుగులు చేసి లాస్ట్ ఓవర్ లో అవుట్ అయ్యాడు. ఇక చివరి ఒవర్ లో బ్యాటింగ్ కు దిగిన అనుజ్ రావత్ 3 బంతుతుల్లో 8 ప‌రుగులు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement