Thursday, May 2, 2024

అంతర్గత కలహాలు, పార్టీ ఆదేశాల ధిక్కరణలు.. చర్చించనున్న కాంగ్రెస్​ డిసిప్లినరీ కమిటీ

కెవి థామస్, సునీల్ ఝాకర్‌లపై దాఖలైన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశం కానుంది. సునీల్ ఝాకర్‌పై పలు ఫిర్యాదులు అందిన తర్వాత పంజాబ్ ఏఐసీసీ ఇన్​చార్జి హరీష్ చౌదరి పార్టీ నాయకత్వానికి లేఖ రాసి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చౌదరికి అందిన ఫిర్యాదులలో పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ జాఖర్ తోటి సహోద్యోగులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పంజాబ్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సునీల్ జాఖర్ ఇటీవల ఒక న్యూస్ ఛానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చాడు, అందులో అతను చన్నీపై మాటల దాడి చేశాడు. చన్నీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని కూడా ఆయన ప్రశ్నించాడు.

మాజీ మంత్రి రాజ్ కుమార్ వెర్కాతో సహా కాంగ్రెస్ నాయకులు ఝాకర్‌ను అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై అతను క్షమాపణలు చెప్పాలని పార్టీ లీడర్లు డిమాండ్ చేశారు. పంజాబ్ మాజీ మంత్రి కూడా జాఖర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి కేవీ థామస్‌పై చర్యలు తీసుకోవాలని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే సుధాకరన్ కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. కన్నూర్‌లో సీపీఐ (ఎం) సెమినార్‌కు హాజరుకావద్దని కోరినప్పటికీ, కేవీ థామస్ హాజరయ్యారన్నారు. దీని తరువాత సుధాకరన్ థామస్  రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన  ఆరోపించారు. పార్టీ ఆదేశాన్ని ధిక్కరించిన థామస్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేరళ కాంగ్రెస్ చీఫ్ కె సుధాకరన్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈమేరకు పార్టీ క్రమశిక్షణా సంఘం ఈ రెండు కేసులను సోమవారం విచారించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement