Tuesday, May 7, 2024

6న ఇంటర్‌ గురుకుల ప్రవేశ పరీక్ష..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెెలంగాణ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఇంటర్మీడియేట్‌ ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షను ఈనెల 6న నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణ కుమార్‌ తెలిపారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన కోరారు.

ప్రవేశ పరీక్షను హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లా కేంద్రాలలో పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టిక్కెట్లలో ఏదైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సరైన ధృవపత్రాలను తీసుకుని తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో సంబంధిత అధికారితో సరిచేయించుకోవాలని ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement