Friday, May 3, 2024

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు…క్లారిటీ !!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో జూన్ నెలాఖరులో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అవకాశం ఉంటే జూన్ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని లేనిపక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా క్లారిటీ ఇచ్చారు.

ఒకవేళ రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు లేకపోతే ప్రథమ సంవత్సరం పరీక్షల మార్కుల ఆధారంగా ఇచ్చేందుకు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇంటర్ బోర్డు గతంలోనూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతంలో ఏప్రిల్ నెలలో పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం జూన్ 1 నాటికి పరిస్థితులు బట్టి పరిశీలిస్తామని అన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement