Thursday, May 2, 2024

Medicine: విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వినియోగం.. టాప్‌లో అజిత్రోమైసిన్‌

ఇండియాలో యాంటీ బయాటిక్స్‌ మందులను విచ్చలవిడిగా వాడుతున్నట్లు లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. ప్రజలు అత్యధికంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లేని యాంటీ బయాటిక్స్‌ మందులనే ఉపయోగిస్తున్నట్లు ఆ అధ్యయనంలో వెలుగు చూసింది. కరోనాకు ముందు, ఆ తర్వాత కూడా యాంటీ బయాటిక్స్‌ మందుల్లో అజిత్రోమైసిన్‌ె మందులను ఎక్కువగా వాడుతున్నారని లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌ దక్షిణాసియా జర్నల్‌లో సెప్టెంబర్‌ 1న ప్రచరురించింది.

విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్‌ ఉపయోగించడం వల్ల వ్యక్తిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కేంద్ర ఔషధ నియంత్రణ మండలి కేవలం వెయ్యి రకాల యాంటీ బయాటిక్స్‌ మందులకు అనుమతి ఇవ్వగా, పదివేలకు పైగా రకాల యాంటీ బయాటిక్స్‌ మార్కెట్‌లో లభ్యమవుతున్నట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. యాంటీ బయాటిక్స్‌ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల మధ్య సమన్వయం లేదని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement