Sunday, April 28, 2024

అయిపాయే: అర్జెంటీనా చేతిలో ఓడిన భార‌త మ‌హిళ‌ల హాకీ జట్టు..

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మెన్స్ హాకీ టీమ్ సెమిఫైనల్ లో ఓటమి చెందగా.. ఇప్పుుడు తొలిసారి సెమీస్ కి వెళ్లిన మహిళల జట్టు కూడా ఓటమి పాలైంది. సెమీ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో మ‌న టీమ్ పోరాడి ఓడిపోయింది. సెమీస్‌లో రెండో నిమిషంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి ఇండియ‌న్ టీమ్‌కు మంచి ప్రారంభం ఇచ్చినా.. ఆ త‌ర్వాత మ‌రో గోల్ సాధించ‌లేక‌పోయారు. అర్జెంటీనా త‌ర‌ఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్ట‌ర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్ట‌ర్ల‌లో రెండు గోల్స్ ప్ర‌త్య‌ర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్ట‌ర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు స‌మం చేసే అవ‌కాశం రాలేదు. సెమీ ఫైనల్లో ఓడినప్పటికి పతకం ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఇక బ్రాంజ్ మెడ‌ల్ కోసం బ్రిట‌న్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్రతి ఊరుకి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ : షర్మిల

Advertisement

తాజా వార్తలు

Advertisement