Friday, May 3, 2024

19, 20తేదీల‌లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్ ప్రారంభం.. హైద‌రాబాద్ సాగ‌ర తీరంలో రేసింగ్‌

హైదరాబాద్‌: ఈ నెల 19, 20 తేదీల్లో హుస్సేన్‌ సాగర్‌ పరివాహక ప్రాంతాల్లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌కు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఈ లీగ్‌కు రెండు రకాల పాస్‌లను జారి చేస్తున్నారు. రెగ్యులర్‌, వీకెండ్‌ పాస్‌లను జారీ చేస్తున్నారు. రెగ్యులర్‌ అయితే ఒక రోజుకు మాత్రమే వర్తిస్తుంది. దీని ఖరీదు రూ 749 వీకెండ్‌ అయితే రెండు రోజులకు వర్తిస్తుంది. దీని ఖరీదు 1,249. లీగ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు బుక్‌ మై షోలో కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement