Thursday, May 2, 2024

అసలు సిసలు క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్..

అది 1936 ఒలింపిక్స్ గేమ్స్ హకీ ఫైనల్లో మ్యాచ్…ఓ భారత ఆటగాడు తన హాకీ స్టిక్ కి ఏదో అయస్కాంత శక్తిని ఆపాదించినట్లుగా మ్యాచ్ మొత్తం బంతిని తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు.. ఇంతలో అనుమానం వచ్చిన నెదర్లాండ్ హీకీ అథారిటీస్..ఆ వ్యక్తి హాకీ స్టిక్ ని సునిశితంగా పరిశీలించారు. ఆ స్టిక్ నిబంధనలకు అనుగుణంగానే ఉంది. అయిన అందులో ఏదైన అయస్కాంత శక్తి ఉందోమోనన్న అనుమానంతో ఆ స్టిక్ ని విరగొట్టి మరో కొత్త స్టిక్ అతనికిచ్చారు. కాని అతడు మునపటికన్న ఎక్కువ జోరుతో గోల్ ఫోస్టుపై దాడి చేశాడు. ఆయన ఆట తీరులో అంత ఈజ్‌ ఉండేది. ఫలితంగా భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇంతకి ఆ ఆటగాడు ఎవరో మీకిప్పటికి అర్థమయి ఉంటుంది.. అతడే భారత క్రీడా ప్రపంచంలోనే దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్. మన దేశానికి ఒలింపిక్స్ నందు హాకీ క్రీడలో బంగారు పతకాలను గెలుచుకొనివచ్చి, హాకీని జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన వారిలో ముఖ్యలు మేజర్ ధ్యాన్‌చంద్.

1905, ఆగస్టు 29 ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించిన ధ్యాన్ చంద్ భారత జట్టు మూడు సార్లు ఒలింపిక్స మెడల్ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ధ్యాన్ చంద్ నేతృత్వంలోనే మన దేశం వరుసగా మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించింది. 1928లో ఆమ్‌స్టర్‌డ్యామ్‌, 1932లో లాస్‌ఏంజెలెస్‌, 1936లో బెర్లిన్‌లో విజయాలు సొంతం చేసుకుంది. దీంతో ధ్యాన్‌చంద్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయన గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ద్యాన్ చంద్ తర్వాత 1948, 1952, 1956 వరకు ఒలింపిక్స్‌లో భారత జట్టు వరుస విజయాలు సాధించింది. 1964లో ఫైనల్స్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గెలిచింది. 1968లో పశ్చిమజర్మనీని ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. 1972లో నెదర్లాండ్స్‌ను ఓడించి, కాంస్యం గెలుచుకుని మూడోస్థానంలో నిలబడింది. 1980 ఒలింపిక్స్‌లో మాస్కోలో ఆఖరుసారి స్పెయిన్‌ను ఓడించి బంగారు పతకం సాధించింది.

ధ్యాన్ చంద్ ఆడుతున్నాడంటే స్టేడియాల్లోకి ప్రేక్షకులు గుమికూడేవారు. -1936నాటి ఒలంపిక్స్ సందర్భంగా బెర్లిన్‌లో పెద్ద ఎత్తున ధ్యాన్ చంద్ పోస్టర్లు వెలిశాయి. ధ్యాన్ చంద్ ఆట చూసేందుకు స్టేడియంకు రావాలంటూ ఆయన ఫ్యాన్స్ ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ధ్యాన్ చంద్ ఆటను చూసి ముగ్ధుడైన హిట్లర్…ఆయనకు జర్మనీ పౌరసత్వంతో పాటు ఆర్మీలో కీలక పదవిని ఆఫర్ చేశారు. జానికి మన అప్పటికి వలసపాలనలోనే ఉన్నాం. ఇప్పటిలా దేశం అభివృద్ధి చెందలేదు. పెద్దగా క్రీడాకారులకు సదుపాయాలు, ప్రోత్సాహం కూడా లేదు. అయినప్పటికీ పరాయిపాలనకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన జ్వాల, కసి, ఆక్రోశంతో మన ఆటగాళ్లు క్రీడల్లో వీరోచితంగా పోరాడేవారు. నాడు జర్మనీ గడ్డపై ఆడిన భారత్‌ 8-1 గోల్స్‌తో జర్మనీని ఓడించింది. ధ్యాన్‌చంద్‌ నాలుగు గోల్స్‌ చేసి, విజయం వరించేలా చేశారు. ఇక జర్మనీతో జరిగిన హాకీ ఫైనల్స్‌లో ద్వితీయార్థంలో ధ్యాన్ చంద్..తన షూ, సాక్స్‌ను తీసేసి మ్యాచ్ ఆడారు. అయినా మూడు గోల్స్ సాధించి భారత్‌కు ఒలంపిక్స్ పతకాన్ని అందించాడు. అంతేకాదు ధ్యాన్ చంద్ తన కెరీర్ మొత్తంలో 400 గోల్స్ చేశాడు.

1956లో తన 16వ యేట మేజర్ ధ్యాన్ చంద్ భారత ఆర్మీలో చేరారు. 2014లో భారత రత్న పురస్కారం కోసం నామినేట్ అయిన వారిలో ధ్యాన్ చంద్ కూడా ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయనకు ఆ దేశ అత్యుత్తన్న పౌరపురస్కారం దక్కలేదు. ఇక ఇన్నాళ్లకు ధ్యాన్ చంద్ పేరుతో ఖేల్ రత్నం అవార్డులను ప్రధానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న: ప్రధాని మోదీ

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement