Saturday, May 11, 2024

రోడ్డు దాటుతుండ‌గా ఢీ కొట్టిన కారు.. ఫ్లోరిడాలో భారతీయుడు మృతి

రోడ్డు దాటుతుండ‌గా ఓ కారు వేగంగా వ‌చ్చి ఢీ కొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పొయాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని తాంపాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారత్ కు చెందిన మరియప్పన్ సుబ్రమణియన్ ఫ్లోరిడాలోని హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో టెస్ట్ లీడ్ గా పనిచేస్తున్నారు. మరియప్పన్ జాక్సన్.. విల్లే నుంచి ఇటీవలే తాంపాకు షిఫ్ట్ అయ్యారు. ఆయనకి భార్య, నాలుగేళ్ల వయసున్న కొడుకు భారత్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తాంపాలోని ఓ రోడ్డు దాటుతున్న మరియప్పన్ ను ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన మరియప్పన్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరియప్పన్ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు, ఆయన కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు మరియప్పన్ స్నేహితులు గో ఫండ్ మీ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement