Friday, April 26, 2024

సౌతాఫ్రికాలో భార‌తీయుడు2 భారీ యాక్ష‌న్ సీన్స్

ద‌ర్శ‌కుడు శంక‌ర్ భార‌తీయుడు2 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో హీరోగా యూనివ‌ర్శ‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్నారు.కాగా భారతీయుడు-2 యూనిట్‌ మరో వారంలో సౌతాఫ్రికా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఓ మేజర్‌ షెడ్యూల్‌ను చిత్రీకరించినున్నట్లు టాక్‌. ఈ షెడ్యూల్‌లో ట్రైన్‌ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని వినికిడి.

అంతే కాకుండా ఈ షెడ్యూల్‌ పూర్తయితే దాదాపు షూటింగ్‌ తుది దశకు చేరుకున్నట్లే అని సమాచారం. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు బాక్సాఫీస్‌ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లో రూ.50 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన తొలి సినిమాగా సంచలన రికార్డు క్రియేట్‌ చేసింది. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ పున: ప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్‌ యథావిధిగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement