Thursday, April 25, 2024

న్యూజిలాండ్‌తో భారత్ ఢీ.. నేడు రెండో వన్డే

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం ఉదయం ఏడుగంటలకు రెండో మ్యాచ్‌ జరగనుంది. భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ హామిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో జరగనుంది. ఇక్కడ టీమ్‌ ఇండియా రికార్డు చాలా దారుణంగా ఉంది. భారత్‌ ఇక్కడ న్యూజిలాండ్‌తో 7 వన్డేలు ఆడగా అందులో ఒక్కసారి మాత్రమే గెలిచింది. మిగిలిన 6 మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ విక్టరీ సాధించింది. దీంతో రేపు జరిగే రెండో వన్డేలో కూడా టీమిండియా విజయం సాధిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిపోయిన టీమిండియా, రెండో వన్డే హమిల్టన్‌లో జరగనుండటంతో పాత రికార్డులు పునరావృతమైతే మాత్రం ఓటమి తప్పదంటున్నారు.

2014 నుంచి 2020 వరకు ఇక్కడి న్యూజిలాండ్‌తో జరిగిన చివరి నాలుగు వన్డేల్లో భారత జట్టు ఓడిపోయి మరో నాలుగు వన్డేలు ఆడింది. అయితే ఈ నాలుగు మ్యాచుల్లో టీమిండియా ఓటమి చవి చూసింది. 2014 జనవరి 22న జరిగిన మ్యాచ్‌లో కివీ జట్టు 15 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించగా ఆరు రోజుల తర్వాత జరిగిన మరో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2019 జనవరి 31, 2020 ఫిబ్రవరి 5న జరిగిన మ్యాచ్‌లలో భారత జట్టు వరుసగా 8,4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సిరీస్‌ నిలబడుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్‌తో పాటు సూపర్‌ లీగ్‌లో రెండో స్థానానికి పడిపోవడం ఖాయం. అలాగే సిరీస్‌ కూడా కివిస్‌ సొంతమవుతుంది.

- Advertisement -

ప్రస్తుతం భారత్‌ 19 మ్యాచుల్లో 13 విజయాలు, ఆరు ఓటములతో 129 పాయింట్లు సాధించింది. ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఒక్క విజయానికి పదేసి పాయింట్లు వస్తాయి. ఈ లెక్కన టీమ్‌ ఇండియా ఖాతాలో 130 పాయింట్లకు బదులు 129 మాత్రమే ఉండటానికి కారణం పెనాల్టి ఓవర్‌. ఎన్ని పెనాల్టి ఓవర్లు వస్తే అన్ని పాయింట్లు కోత పడతాయి. అలాగే మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకూ చెరో ఐదేసి పాయింట్లు వస్తాయి. ఈ క్రమంలో భారత్‌కు ఒక పెనాల్టి ఓవర్‌ ఉండటంతో ఒక పాయింట్‌ తగ్గింది. మరో వైపు న్యూజిలాండ్‌ 16 మ్యాచుల్లో 12 విజయాలు, నాలుగు ఓటములతో 120 పాయింట్లతో ఉంది. ఒక వేళ రెండో వన్డేలో కివీస్‌ విజయం సాధిస్తే అప్పుడు 130పాయింట్లకు వెళ్లిపోతుంది. ఇప్పటి వరకు అగ్ర స్థానంలో ఉన్న భారత్‌ రెండో స్థానానికి పడిపోతుంది. అయితే తొలి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ ఐసీసీ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో భారత్‌ స్థానం మారలేదు. అగ్ర స్థానంతో కొనసాగుతుంది.

ఐసీసీ పాయింట్ల పట్టికలో టాప్‌ -8 జట్లు భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఐదు జట్లు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ సారి 13 జట్లు బరిలోకి దిగబోతున్నాయి. అయితే భారత్‌ పాయింట్ల పరంగా అర్హత సాధించకపోయినా ఆతిథ్య జట్టు హోదాలో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్‌, కివీస్‌ కాకుండా ఇంగ్లండ్‌(125 పాయింట్లు), ఆస్ట్రేలియా (120), బంగ్లాదేశ్‌ (120), పాకిస్థాన్‌ (120), అప్గనిస్థాన్‌ (110), వెస్టిండీస్‌ (88) టాప్‌ -8లో కొనసాగుతున్నాయి. ఐర్లాండ్‌ (68), శ్రీలంక(62), దక్షిణాఫ్రికా (59), జింబాబ్వే (45), నెదర్లాండ్స్‌ (25) స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement