Thursday, May 16, 2024

Followup: వ్యవసాయంలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌, ప్రధాని మోడీ ఆశాభావం..

వ్యవసాయంలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఆవిర్భవించాలని ప్రధాని నరేంద్రమోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత దేశమైన ఇండియా ఆ రంగంలో ప్రపంచ దేశాల్లో నెంబర్‌ వన్‌గా అవతరించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో కీలక మార్పులు, సంస్కరణలు ప్రవేశ పెట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృసి చేయాలని ప్రధాని సూచించారు. ప్రధానంగా ఆయిల్‌ విత్తనాలు, పల్సెస్‌లో ఇండియా స్వయంసమృద్ధి సాధించాలని ప్రధాని మోడీ కోరారు. అగ్రి కమ్యూనిటీల్లో ఇండియా స్వయం సమృద్ధి సాధించడం, పంటమార్పిడి అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ నీతిఆయోగ్‌ సదస్సులో చర్చించారు. నీతిఆయోగ్‌ అజెండాలో పొందుపరిచిన జాతీయ విద్యావిధానంతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సదస్సులో చర్చించడం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం న్యూఢిల్లిdలోని రాష్ట్రపతిభవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో నీతి ఆయోగ్‌ 7వ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌లు గైర్హాజరయ్యారు. ఈ స దస్సులో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షోపన్యాసం చేస్తూ, ఇండియా కొవిడ్‌9ను ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వాల కృసి ఉందని ప్రశంసించారు. సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పని చేయడం వలన ఇండియా కొవిడ్‌ 19 పాండమిక్‌ను ధీటుగా ఎదుర్కొందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 7వ నీతి ఆయోగ్‌ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ, కొవిడ్‌ సమయంలో ప్రతి రాష్ట్రం కీలకమైన రోల్‌ పోషించిందని అన్నారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి ప్రతి రాష్ట్రమూ కీలకమైన పాత్ర పోషించిందని, అందువల్లనే ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశాలు గ్లోబల్‌ లీడర్‌ కాగలవని చాటి చెప్పిందని ఆయన అన్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే కేంద్రప్రభుత్వం నీతిఆయోగ్‌ సమావేశాలు నిర్వహించింది.

2021లో సైతం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే ప్రధాని నరేంద్రమోడీ నీతిఆయోగ్‌ సమావేశం నిర్వహించారు. దీంతో, కరోనా తర్వాత జరిగిన మొదటి ప్రత్యక్ష నీతిఆయోగ్‌ సమావేశం ఇదే. ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆకాశానికి ఎత్తేశారు. కొవిడ్‌ 19 సంక్షోభ సమయంలో ఇండియా ప్రపంచానికి బలమైన సంకేతాన్ని పంపిందని ప్రధాని అన్నారు. స్వల్ప వనరులు, ఉన్నప్పటికీ పరస్పర సహకారంతో ఇబ్బందుల నుంచి గట్టెక్క వచ్చని, సవాళ్లను ఎదుర్కోవచ్చని ఇండియా ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆ ఘనత రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందని ఆయన ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కింది స్థాయి వరకు సరఫరా చేసిందని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారానికి నీతిఆయోగ్‌ ఒక దారి చూపుతోందని ప్రధానమంత్రి కఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌లతో కలిసి పాల్గొన్నారు. చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌బాగ్హెల్‌ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. రూరల్‌ ఏరియాల్లో ఎంజీఎన్‌ఆర్‌ఇజీఏను అమలు చేయాలని, 20 వేల జనాభా కంటే తక్కువ ఉన్న నగరాల్లో కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జీఎస్టీ పరిహారంపై కూడా ఆయన ఈ సదస్సులో ప్రస్తావించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement