Friday, April 26, 2024

పెరుగుతున్న ఓటీటీల డిమాండ్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లకు జియో కొత్త యాప్

ఇండియ‌న్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లకు పోటీగా జియో ఇప్పుడు కొత్తగా ఓటీటీ యాప్ లాంచ్ చేస్తోంది. జియో వూట్ పేరుతో ఈ యాప్ ని లాంచ్ చేయ‌నుంది. ప్ర‌స్తుతం జియో సినిమా యాప్ లో ఐపీఎల్ 2023 ప్రత్యక్ష ప్రసారం కారణంగా ప్రాచుర్యంలో వచ్చింది. దీంతో యాప్ కు డిమాండ్ పెరిగింది. కాగా, ఇప్పుడు జియో సినిమా పేరును జియో వూట్‌గా మార్చవచ్చని తెలుస్తోంది. ఈ ఓటీటీ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఇందులో లేటెస్ట్ సినిమాలు, క్రికెట్ మ్యాచ్ స్ట్రీమింగ్ ఇలా అన్నీ అందుబాటులో ఉంటాయి. జియో వూట్ నేరుగా మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉండి ప్రాచుర్యం పొందిన ప్రముఖ ఓటీటీ వేదికలు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లతో తలపడనుంది.

అతి తక్కువ ధరలో జియో వూట్ సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. జియో వూట్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ 99 రూపాయలతో ప్రారంభం కానుంది. దీంతో పాటు జియో బేస్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్స్ కూడా ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో ప్రీమియం ప్లాన్ హై క్వాలిటీ వీడియో కంటెంట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు అందిస్తుంది. జియో వూట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. జియో వూట్ ఎప్పుడు లాంచ్ అవుతుంద‌ని ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత.. మే 28 వరకూ లాంచ్ చేయవచ్చని టెక్ వ‌ర్గాల‌ స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement