Monday, April 29, 2024

పిఎఫ్‌లో చేరే వేతన పరిధి 21 వేలకు పెంపు.. 7.5 మిలియన్ల మంది ప్రయోజనం

కేంద్ర కార్మిక శాఖ పిఎఫ్‌లో చేరేందుకు ప్రస్తుతం ఉన్న వేతన పరిధిని 21 వేలకు పెంచనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం 15 వేల వరకు వేతనం వచ్చే వారే పిఎఫ్‌ పరిధికి వస్తున్నారు. వేతన సీలింగ్‌ను 21 వేల కు పెంచడం వల్ల లక్షలాది మంది కార్మికులు,ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని ఒక అధికారి చెప్పారు. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలవడనున్నాయి. చివరి సారిగా 2014లో వేతన సీలింగ్‌ను పెంచారు. 1952లోఈపిఎఫ్‌ అమల్లోకి వచ్చిన తరువాత 9 సార్లు సీలింగ్‌ పెంచారు.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 20 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ, కంపెనీ తప్పనిసరిగా ఈపిఎఫ్‌వోలో నమోదు చేసుకోవాల్సి వుంటుంది. పరిధిని 21 వేలకు పెంచితే 7.5 మిలియన్ల కార్మికులు, ఉద్యోగులు ఈపిఎఫ్‌ పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం ఇందులో 68 మిలియన్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement