Sunday, April 28, 2024

Karnataka: రైతును పెళ్లి చేసుకునే యువ‌తికి రూ.5ల‌క్ష‌లు ప్రోత్సాహం అందించండి….

కర్ణాట‌క‌లో సీఎం సిద్దిరామ‌య్య‌కు రైతు సంఘాల ప్ర‌తినిధులు విన్నూత్న విజ్ఞ‌ప్తి చేశారు. రైతును వివాహం చేసుకునే యవతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సీఎంకు వినతి పత్రాన్ని అందించారు.రైతులను ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదని, రైతు అనగానే యువతుల తల్లిదండ్రులు కూడా పిల్లనివ్వడానికి ఆసక్తి చూపించడం లేదని కర్ణాటక రైతులు వివరించారు.

బడ్జెట్‌లో సేద్యానికి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు నిధుల కేటాయింపునకు సంబంధించి రైతు సంఘాలకు చెందిన 218 మంది రైతులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. ఈస‌మావేశంలో కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల రుణమాఫీతో పాటు రైతును వివాహం చేసుకునే యవతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సీఎంకు వినతి పత్రాన్ని అందించారు. సేద్యాన్ని నమ్ముకుని, ఏటా రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నా, 45 ఏళ్లు వస్తున్నప్పటికీ రైతులకు వివాహం కావడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేస్తున్న ఐదు గ్యారంటీలను రైతు సంఘం నాయకులు కొనియాడారు. గ్రామాల్లో ఈ పథకాలకు చక్కని స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement