Tuesday, October 8, 2024

తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో.. క‌బ్జా మూవీ టీం

క‌బ్జా మూవీ టీం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.. క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన సినిమా ‘కబ్జా’. పాన్ ఇండియా స్థాయిలో మార్చి 17న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ‘కబ్జా’ చిత్ర దర్శకుడు చంద్రుతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.దర్శనం తర్వాత ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమని ఉపేంద్ర తెలిపారు.కబ్జా సినిమాలో ఉపేంద్రతోపాటు కన్నడ సూపర్ స్టార్లు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించారు. తాను నటించిన ‘కబ్జా’ చిత్రం విడుదల సందర్భంగా ఆశీర్వాదం కోసం శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement