Thursday, April 25, 2024

పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఆరోపణలు అవాస్త‌వం.. నిరాధార ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తున్నాం : మ‌హిళా సంఘం

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో డీసీపీవోగా పనిచేసిన మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు తమ కుమారుడికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, దివ్యాంగుల చైర్మన్ కే వాసుదేవరెడ్డి నుండి ప్రాణహాని ఉందని చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం అని BRTU శ్రామిక మహిళ రాష్ట్ర నాయకురాలు నల్ల భారతి, సీనియర్ డాక్ట‌ర్‌ మోహన్ రావు, BRTU జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.

2020 సంవ‌త్స‌రం నుండి ఐసిడీఎస్ లో పనిచేస్తున్న తన తోటి ఉద్యోగిని, తనను మహేందర్ రెడ్డి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాఖ పరంగా విచార‌ణ చేప‌ట్టార‌ని, ఆ ఆరోపణలు నిజమని నిర్ధారించి మహేందర్ రెడ్డిపై శాఖపరమైన చర్యలుతీసుకున్నారన్నారు. దీనిలో ఎమ్మెల్యే పాత్ర ఉందని చెప్పడంలో నిజం లేదన్నారు. నెక్కొండ మండలంలోని తండాలో శిశువు విక్రయం జరిగిన సంఘటన నాలుగు నెలల క్రితం జరిగితే.. ఆయ‌న‌పై ఆరోపణలు దాదాపు రెండేళ్ల నుంచి జరుగుతున్నాయ‌ని అన్నారు.

శిశు విక్రయం కేసులో ఎమ్మెల్యే మాట విననందున కక్షగట్టి సదరు మహిళతో ఫిర్యాదు చేయించారని చెప్పటంలో వాస్తవం లేదన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ కుటుంబంతోనే పట్టణ కేంద్రంలో నివాసం ఉంటున్నార‌ని, సమస్య చెప్పుకోవ‌డానికి వ‌చ్చిన వారి ఇబ్బందుల‌ను పరిష్కరించే వారే తప్ప, ఒకరికి హాని చేసే తత్వం తనది కాదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement