Wednesday, May 1, 2024

బాక్సింగ్‌ మ్యాచ్‌లో.. గన్‌ ఫైరింగ్‌..

న్యూఢిల్లి : బ్రూక్లిన్‌ వేదికగా.. బార్క్‌లేస్‌ సెంటర్‌లో గెర్వొంటా డేవిస్‌, రొనాల్డో రొమేరో మధ్య ఎంతో ఆసక్తిగా బ్యాక్సింగ్‌ ఫైట్‌ పూర్తయ్యింది. గెర్వొంటో.. రొనాల్డో రెమోరోపై నాకౌట్‌ విజయం సాధించాడు. అయితే అందులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ ముగిసిన తరువాత కాల్పుల శబ్దం వినిపించడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో స్టేడియం బయటకు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో ప్రేక్షకులు గాయపడ్డారు. విజేతను ప్రకటిస్తున్న సమయంలోనే కాల్పుల శబ్దం వినిపించింది. ఎరీనాలోకి ఆగంతకుడు తుపాకీతో చంపడానికి వచ్చాడెమో అని భయపడిన ప్రేక్షకులు ఒకరినొకరు తోసుకుంటూ బయటికెళ్లేందుకు ప్రయత్నించారు. కాల్పులు జరిగింది బార్క్‌లే సెంటర్‌లో కాదని.. బయట అని తేలడంతో అందరూ శాంతించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement