Monday, April 29, 2024

స్ట్రయిట్ తెలుగు చిత్రాల రిలీజ్ కే ప్రాముఖ్యత.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తెలుగు ఫిలింప్రొడ్యూసర్స్ కౌన్సిల్

వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో స్ట్రయిట్ తెలుగు చిత్రాల రిలీజ్ కే ప్రాముఖ్యత లభించనుంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారిసు, తునివు తెలుగు రాష్ట్రాల్లో 2023 సంక్రాంతి కి విడుదల కాబోతున్నాయి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ మేరకు ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది.తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి మొదటి ప్రాధాన్యత స్ట్రెయిట్‌ తెలుగు చిత్రాలకు ఇచ్చారు. ఒకవేళ థియేటర్లు మిగిలితే ఆ థియేటర్లలో డబ్బింగ్‌ సినిమాలను విడుదల చేసుకోవచ్చని నోట్‌ లో పేర్కొంది. తెలుగు సినిమాల నిర్మాణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని, నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో.. సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇవ్వాలని 08-12-2017 మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం తాజా నిర్ణయం తీసుకున్నట్టు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ నోట్‌లో తెలిపింది. అయితే ఈ నాలుగు సినిమాల్లో నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్న తమిళ చిత్రం వారిసు ఉంది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల అవుతుంది. ఈ మూవీ స్ట్రెయిట్‌ తెలుగు సినిమా కాకపోవడంతో విడుదల అంతా సవ్యంగానే ఉంటుందా.. అని ఇపుడు అందరూ చర్చిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశాలున్నట్టు ఫిలినగర్ సర్కిల్ సమాచారం. మరి ఈ రెండు భారీ సినిమాలు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి బరిలో పై సినిమాలుంటాయా.. ఉంటే ఎన్ని థియేటర్లు దొరుకుతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement