Tuesday, April 30, 2024

నాలుగు రాష్ట్రాలకు వడగాల్పుల హెచ్చరిక జారీచేసిన ఐఎండి

భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, సిక్కిం, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోసహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీచేసింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రతీరోజూ నవీకరించబడే వాతావరణ బులెటిన్‌లో ఐఎండి తెలిపింది. ఈశాన్యభారతదేశం, ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, మధ్య భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. గత ఎనిమిది రోజులుగా పశ్చిమబెంగాల్‌, అయిదు రోజులుగా బీహార్‌లలో వేడిగాలులు వీస్తున్నాయి. ఇదిలా వుండగా రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో గణనీయమైన మార్పులేమీ ఉండవు. అయితే మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షం బుధవారం వేడి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చని ఐఎండి తెలిపింది.

- Advertisement -

పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య భారతదేశం, పశ్చిమబెంగాల్‌లోని అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ఐఎండి తెలిపింది. ఒక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రదేశంలో కనీసం 40 డిగ్రీల సెల్సియస్‌కు, తీరప్రాంతాలలో కనీసం 37 డిగ్రీల సెల్సియస్‌కు, కొండ ప్రాంతాలలో కనీసం 30 డిగ్రీలకు చేరుకుంటే హీట్‌వేవ్‌ జారీ చేయబడుతుంది. గతవారం వాతావరణశాఖ ఏప్రిల్‌ 13-19 మధ్య వాయువ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులను అంచనావేసింది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అయినా పొడి పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నందున వేడి పెరుగుతుంది. ఒక వారం తర్వాత వాయువ్య, తూర్పు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో హీట్‌వేవ్‌ ఏర్పడవచ్చని ఐఎండి శాస్త్రవేత్త నరేష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement