Saturday, March 2, 2024

ఈ నెల 29న బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్-గెస్ట్ గా ఎన్టీఆర్

హీరోగా ..నిర్మాత‌గా బింబిసార మూవీని నిర్మిస్తున్నారు క‌ల్యాణ్ రామ్.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నారు.పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ నెల 29 వ తేదీన శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్‌ జరుగనుండగా.. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ రానున్నారు. కాగా ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement