Thursday, April 18, 2024

ద్రవిడ్‌కు అస్వస్థత.. మూడో వన్డేకు అనుమానమే

శ్రీలంకతో మూడో వన్డేకు ముందు టీమ్‌ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలిసింది. శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే తిరువనంతపురంలో జరిగే మూడో వన్డేకు భారత్‌ సిద్దం అవుతుండగా ఊహించని షాక్‌ తగిలింది. రెండోవన్డే ముందు రోజే తన 50వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అస్వస్థతకు గురయ్యాడు.

రక్తపోటు విపరీతంగా ఉండటంతో ట్యాబ్లెట్లు వేసుకుని రెండో మ్యాచ్‌ లో పాల్గొన్న రాహుల్‌ తాజాగా ఇంటికి వెళ్లిపోయాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే తను బెంగుళూరు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో తిరువనంతపురంలోని గ్రీన్‌ ఫీల్డ్‌ మైదానంలో జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. అతడి స్థానంలో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement