Thursday, April 25, 2024

సానియా రిటైర్మెంట్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా చేరుకుంది

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్‌ వేదికగా తన రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియేన్‌ ఓపెన్‌, దుబాయ్‌ ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపింది. ఈ రెండు తనకు చివరి టోర్నీలను వెల్లడించింది. ఈ మేరకు రిటైర్మెంట్‌ పై ఉద్వేగ భరితమైన మూడు పేజీల నోట్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడింది. ఇందులో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గూర్చి వివరించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫిబ్రవరిలో దుబాయ్‌ ఓపెన్‌ ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. . ఇందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించింది.

30 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో తన తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్‌లో టెన్నిస్‌ కోర్టుకు వెళ్లానని, అక్కడ కోచ్‌ టెన్నిస్‌ ఎలా ఆడాలో వివరించినట్లు గుర్తు చేసుకుంది. ఆరేళ్ల వయసు నుంచే నా కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందన్న సానియా.. అన్ని సమయాల్లో తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్‌ , ఫిజియో , మొత్తం టీం మద్దతు లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని పేర్కొంది.

- Advertisement -

ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానన్న సానియా.. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ ధన్యవాదాలు తెలిపింది. సానియా తన కెరీర్‌లో 36 సంవత్సరాల వయసులో ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో కజకిస్థాన్‌కు చెందిన అనా డానిలినాతో కలిసి గ్రాండ్‌ స్లామ్‌ ఆడనుంది. మోచేయి గాయం కారణంగా గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఫిట్‌నెస్‌ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

ఈ క్రమంలో గతేడాది రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలగడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నది. సానియా కెరీర్‌లో ఆరు గ్రాండ్‌ స్లామ్‌లను సాధించింది. ప్రపంచ నెంబర్‌ వన్‌ డబుల్స్‌ క్రీడాకారిణి నిలిచింది. అంతకు ముందు సింగిల్స్‌నూ సత్తా చాటింది. ప్రపంచ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. 2005లో ఓపెన్స్‌లో నాల్గో రౌండ్‌కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement