Monday, April 29, 2024

మూసి ప్రక్షాళన కలేనా.. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: అనంతగిరి కొండల్లో పుట్టిన మూసి బాపుఘాట్‌ వరకు హైదరాబాద్‌ నగరంలో దాదాపు 44 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలో కెమిక ల్‌, ఫార్మాతో పాటు గృహ, వాణిజ్య రంగాల నుంచి వెలువడే విష పదార్థాలు నదిని కాలుష్య కాసారంగా మార్చాయి. జీహెచ్‌ఎంసీ పరదిలోని 50కి పైగా పెద్ద నాళాలు, వందలాది చిన్న చిన్న డ్రైనేజీల మురికి నీరు 90 శాతనికి పైగా నదిలో కలుస్తోంది. పలితంగా నది జలాలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ నివేధిక ప్రకారం తెలంగాణలో అత్యంత కాలుష్య నదిగా గుర్తింపు పొందింది. మూసి నది మురికిని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకుంటే భవిష్యత్‌లో నగర ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

- Advertisement -

ప్రమాదకర స్థాయిలో ఉద్గారాలు..

రసాయన, తోళ్లు, ఇతర పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలతో మూసి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మూసిలోని ఒక లీటర్‌ నీటిలో 18 గ్రాముల బీవోడి ఉండగా, ఆక్సిజన్‌ మాత్రం కేవలం 0.3 గ్రాములు ఉందని తేలింది. కోలిఫాం, అమ్మోనియా, బోరాన్‌, ఎన్‌ఏఆర్‌ పదార్ధాలు సాధారణం కంటే అనేక రెట్లు అధికంగా ఉన్నాయని పలు అద్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా ప్రతాప సింగారం నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు దాదాపు 44 కిలోమీటర్ల మూసి పరివాహకం అత్యంత ప్రమాదకరమైన కాలుష్య ప్రాంతంగా తయారైందని తెలుస్తోంది. మూసిలో ప్రవహించే నీరు మనుషులతో పాటు పశువులు కూడా పనికి రావని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నామా మాత్రంగా తయారైన మూసి రివర్స్‌ ఫ్రంట్‌

మూసి ప్రక్షాళన కోసం ఏర్పాటైన మూసి రివర్స్‌ ఫ్రంట్‌ నామమాత్రంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి. ప్రతాప సింగారం నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు కేవలం చెక్‌డ్యాంలు, వాక్‌ పాత్‌లు ఏర్పాటు చేసిందనే తప్ప, పారిశ్రామిక, వాణిజ్య, గృహ ప్రాంతాల నుంచి వెలువడుతున్న వెలువడుతున్న వ్యర్థాలను మూసిలో కలువ కుండా నిరోదించడంలో విఫలమైంది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌, ఇతర పర్యావరణ సంస్థల నుంచి వస్తున్న ఒత్తడిని తట్టుకునే తూతూ మంత్రంగా చర్యలు చేపట్టినట్టు పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మూసి రివ ర్స్‌ ఫ్రంట్‌కు పెత్త ఎత్తున నిధులు కేటాయించి మూసి ప్రక్షాళన వేగవంతం చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement