అనంతపురం : చంద్రబాబు పవన్ కలయికపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనంతపురంలో వచ్చే పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తా అన్నారు. తన భుజస్కందాల మీద మోసి గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ఓటమి, జగన్ ఇంటికి పోవడమే టీడీపీ, జనసేనా పార్టీల లక్ష్యం అన్నారు. జనసేన మాకు గతంలో పొత్తులో ఉన్న పార్టీ అని, రాష్ట్రంలో ఎన్నికలకు తన వ్యూహం వేరే ఉందని పవన్ గతంలో చెప్పాడు అన్నారు. ఇవాళ చంద్రబాబుతో కలయికాందులో భాగమే ఉండొచ్చు అన్నారు. ఎన్నికల సమయంలో జరిగే పొత్తులపై అప్పటి పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అన్నారు.
- Advertisement -