Friday, May 3, 2024

ఐకాన్ స్టార్ కి 7మిలియ‌న్స్ కి పైగా ఫాలోవ‌ర్స్ – థ్యాంక్స్ చెప్పిన బ‌న్నీ

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాగా పుష్ప‌కి సీక్వెల్ గా పుష్ప‌2 తెర‌కెక్క‌నుంది. బ‌న్నీకి పెరిగిన ఫ్యాన్స్ తో ట్విట్టర్‌లో అల్లు అర్జున్ ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్స్ దాటేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌కు థ్యాంక్స్ చెప్పారు. స్టైలిష్ లుక్‌లో ఉన్న పిక్‌ను కూడా షేర్ చేశారు. బ్లాక్ షర్ట్, బ్లాక్ ఫ్యాంట్ లో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ పిక్‌ను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. పుష్ప-2 మూవీ సెట్స్‌పై వెళ్లేందుకు టైమ్ పడుతుండడంతో అల్లు అర్జున్ యాడ్స్ కంప్లీట్ చేస్తున్నారు.

వీటికి సంబంధించిన పిక్స్‌ను ఎప్పటికప్పుడు బన్నీ షేర్ చేసుకుంటుడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇటీవల రోజుకో లుక్‌తో అభిమానులను ట్రీట్ ఇచ్చారు. తాజాగా షేర్ చేసిన పిక్ కూడా.. యాడ్ షూట్ కోసం తీసినదే. పుష్ప-2 షూటింగ్ మొదలయ్యేలోపు సైన్ చేసిన యాడ్స్ పూర్తిచేసే పనిలో ఉన్నారు స్టైలిష్ స్టార్. ఇప్పుడు అందరి కళ్లు పుష్ప-2 మూవీపై ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వేసవికి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement