Thursday, May 2, 2024

సీనియర్‌ సిటిజన్స్ కు ఐసీఐసీఐ శుభవార్త.. అదనపు వడ్డీ రేట్ల ప్రయోజన పథకం

ప్రైవేటురంగ ఐసీఐసీఐ బ్యాంకు సీనియర్‌ సిటిజన్స్‌ కోసం తీసుకువచ్చిన అదనపు వడ్డీ రేట్ల ప్రయోజనం పథకం గోల్డెన్‌ ఇయర్స్‌ రేట్స్‌ పథకం గడువును పొడిగించింది. జనవరి 20, 2022న ఈ పథకం అమలులోకి వచ్చింది. 2022 ఏప్రిల్‌ 8వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అక్టోబర్‌ 7, 2022 వరకు దీనిని కొనసాగించనున్నట్లు బ్యాంకు తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. ఈ పథకం కింద భారత్‌లో నివసిస్తున్న సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్స్‌పైన ఏడాదికి అదనంగా ఇచ్చే 0.50శాతం వడ్డీ రేటుకు మరో 0.25 శాతం అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ పథకం పరిమితకాలంపాటు అమలులో ఉంటుంది. ఈ పరిమిత సమయంలో చేసిన కొత్త డిపాజిట్లు, పునరుద్ధరణ చేసిన డిపాజిట్లకు మాత్రమే ఈ అదనపు వడ్డీ రేటు ప్రయోజనం లభిస్తుంది. అయిదేళ్లకు మించి కాలపరిమితితో చేసే డిపాజిట్లకు మాత్రమే ఈ అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం సాధారణ వడ్డీరేటు అయిదేళ్ల ఒకరోజు నుండి పదేళ్ల వరకు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంకు 5.6 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. రూ.2కోట్లలోపు ఫిక్డ్స్‌ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

వృద్ధులకు ఈ ప్రత్యేక పథకం కింద అదనంగా 0.5 శాతానికి మరో 0.25 శాతం కలిపి 6.35 శాతం వడ్డీని చెల్లిస్తోంది. తాజాగా మరోసారి ఎఫ్‌డీ స్కీమ్‌ గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది. దీంతో ఈ స్కీమ్‌ సినీయర్‌ సిటిజన్లకు మరో 5 నెలల పాటు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు కొత్తగా ఓపెన్‌ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు వర్తించనుంది. దాంతో పాటుగా పాత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను రెన్యూవల్‌ చేసుకున్నవారికి కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక పథకం 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ సీనియర్‌ సిటిజన్‌లకు 6.35 శాత వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ ఖాతాదారులకు అందించే 5.60 శాతం కంటే ఎక్కువ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement