Friday, May 3, 2024

రానా నాయుడులో నా పాత్ర సంతృప్తినిచ్చింది.. వెంక‌టేశ్

ఫ‌స్ట్ టైం రానా నాయుడు వెబ్ సిరీస్ లో న‌టించారు హీరో వెంక‌టేశ్. అయితే రానా నాయుడు లో తాను పోషించిన పాత్ర సంతృప్తిని ఇచ్చింద‌ని హీరో వెంక‌టేశ్ తెలిపారు. ఓటీటీ వేదికగా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించారు. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్టార్లు నటించడంతో ఈ వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. అయితే అందులోని కంటెంట్, డైలాగులు విమర్శల పాలయ్యాయి. రానా నాయుడు వెబ్ సిరీస్ పై వెంకటేశ్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు.వెబ్ సిరీస్ లో నటించడం అనేది వ్యక్తిగతంగా తనకు చాలా కొత్తగా ఉంద‌న్నారు. ఈ పాత్రను తాను చేయగలనని చిత్రబృందం నమ్మిందని, అత్యుత్తమ నటన కనబర్చానని భావిస్తున్నానని వెంకటేశ్ తెలిపారు. ఇప్పటివరకు తనకు ఫ్యామిలీ హీరో క్రేజ్ ఉందని వివరించారు. ఇలాంటి పాత్రలు గతంలో ఎప్పుడూ చేయలేదని, ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement